మొన్న అర్నాబ్, నిన్న మురసు, ఇప్పుడు అక్వాన్: ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.!
Published on: Tue Nov 17, 2026 11:56AM

ఆంధ్రప్రదేశ్ పై మరో పెను తుపాను అక్వాన్ పంజా విసరనుంది. ఈ తీవ్ర తుపాను వేగంగా ఏపీవైపు దూసుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు. తుపాను కదలికలు, తీవ్రత, రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.
తీసుకోవలసిన చర్యలపై వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ పునాను మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని తీవ్రత మరింత పెరిగి, పెను తుపానుగా మారే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో సాధ్యమైనంత వరకూ తుపాను నష్టాన్ని కనిష్టంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం సంభవించకుండా, తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

స్వల్ప వ్యవధిలో రాష్ట్రంలో తీరాన్ని తాకుతున్న మూడో విప్తత్తు ఇది కావడం గమనార్హం. తుఫాన్ ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా అధికారులు ముందుస్తుగానే పకడ్బందీ చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలకు నేరుగా సమాచారం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ఏపీకి మరో తుపాను గండం: దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు.!
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్న నమ్మకాన్ని ప్రజలలో కల్పించాలన్నారు. తుఫాన్ ధాటికి చెట్లు నేలకూలినా లేదా విద్యుత్ స్తంభాలు విరిగిపడినా వెంటనే వాటిని తొలగించి, రవాణా మరియు విద్యుత్ సరఫరా వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

రియల్ టైమ్‌లో వాతావరణ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేస్తూ అవసరమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని, ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాన్ వర్షాల కారణంగా చెరువులు, సాగునీటి కాల్వలకు గండ్లు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
మీకు నచ్చవచ్చు: ఏపీకి మురసు ముప్పు: ఒంగోలు సమీపంలో తీరం దాటనున్న తీవ్ర తుపాను.!
ఏపీకి మరో తుపాను ముప్పు: రాష్ట్రంపై ప్రకృతి పగపట్టిందా.?
[CycloneAkwan, APhialert, CM Chandrababu Naidu, Teleconference, TeluguOne]


