ఏపీకి మురసు ముప్పు: ఒంగోలు సమీపంలో తీరం దాటనున్న తీవ్ర తుపాను.!
Published on: Mon Nov 2, 2026 7:13AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మురసు తుపాను, తీవ్ర తుపానుగా బలపడింది. ఇది సోమవారం (నవంబర్ 2 అర్ధరాత్రి లేదామంగళవారం (నవంబర్ 3) తెల్లవారుజామున నెల్లూరు - నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. సోమవారం (నవంబర్ 2) ఉదయం ఈ మురసు తుపాను ఒంగోలుకు 330 కి.మీ, నెల్లూరుకు 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.

ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉటుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా బాప (స్టార్మ్ సర్జ్) ఎగిసిపడే ప్రమాదం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
[Murasu CyClone Secere Effect Andhra Pradesh, South Coat, Rayalaseema, Red Elert, Heavy Rails, Wild, Winds]


