TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణపైనా ఆక్వాన్ ఎఫెక్ట్: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.!

Published on: Tue Nov 17, 2026 1:49PM

బంగాళాఖాతంలో ఏర్పడి దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్  ప్రభావం  ఆంధ్రప్రదేశ్‌పైనే కాకుండా   తెలంగాణ  పై కూడా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

 ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది.  

ఈ భారీ వర్షాలకు తోడు గంటకు   60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా  భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట,  మహబూబాబాద్ జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఆయా జిల్లాలకు వర్షపాతం అంచనా ఆధారంగా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  ములుగు, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

తుఫాన్ సమయంలో  బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు హెచ్చరించారు. పిడుగుపాటుకు కూడా అవకాశం ఉందనీ, వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ తీగలకు సమీపంలో ఉండొద్దని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: అక్వాన్ తుపాను ప్రభావం: తెలంగాణకు భారీ వర్ష సూచన.!

భారీగా వీచే ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా లోతట్లు ప్రాంతాలు జలమయమౌతాయనీ, ఆయా ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలనీ సూచించింది. అలాగే అధికారులు వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. 

వ్యవసాయ రంగంపై కూడా ఈ తుఫాన్ ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు తమ కోత దశకు వచ్చిన పంటలను కాపాడుకోవడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.  వర్షాల కారణంగా ఎక్కడైనా నీరు నిలిచినా లేదా రోడ్లకు అడ్డంకులు ఏర్పడినా తక్షణ చర్యలు చేపట్టేలా సిబ్బందిని అప్రమత్తం చేసింది. 

మీకు నచ్చవచ్చు:  తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు.!

తెలంగాణకు అతి భారీ వర్ష సూచన: ఈశాన్య రుతుపవనాల ప్రభావం.!


[CycloneAkvan, Effect,  Telangana, IMDalert, Heavyrains TeluguOne]