TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు అతి భారీ వర్ష సూచన: ఈశాన్య రుతుపవనాల ప్రభావం.!

Published on: Sat Oct 17, 2026 5:36PM

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్  వాతావరణ శాఖ పేర్కొంది.  ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు దక్షిణ,  మధ్య తెలంగాణ   జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంఉంది. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి,  యాదాద్రి భువనగిరి  జిల్లాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన  భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.  వర్షం పడే సమయంలో గంటకు  40 కిలోమీటర్ల వేగం ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక   హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.  

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తవుతున్న వేళ ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా మారింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగరాలు మరియు పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థల వద్ద అప్రమత్తత అవసరమని అధికారులు ఆదేశించారు. స్థానిక యంత్రాంగాలు, మున్సిపల్ సిబ్బంది అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వెలువడ్డాయి. 

[Telangana Rain Forecast Yellow Alert, IMD Hyderabad Weather Update, Telangana Heavy Rains, Northeast monsoon, Telugu One]