TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్వాన్ తుపాను ప్రభావం: తెలంగాణకు భారీ వర్ష సూచన.!

Published on: Sun Nov 15, 2026 12:10PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం బలపడి తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపానుకు అక్వాన్ అన్న పేరు ఖరారు చేశారు. ఆక్వాన్ ప్రభావంతో  తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  

అక్వాన్ కోస్తాంధ్ర వైపు పయనించే క్రమంలో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నవంబర్ 20 నుంచి22 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. తుపాను ప్రభావంతో ఇది కోల్డ్ వేవ్ స్థాయికి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి:  తెలంగాణకు అతి భారీ వర్ష సూచన: ఈశాన్య రుతుపవనాల ప్రభావం.!

అక్వాన్ తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతాంగం ఆందోళన చెందుతోంది.   ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వరి కోతలు ముగిసి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, కల్లాలకు చేరే దశలో ఉంది.

ఈ తరుణంలో వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.  

మీకు నచ్చవచ్చు:  ఏపీకి మరో తుపాను గండం: దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు.!

తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!


[Cyclone Akwan, Heavyrains, Telangana, IMDwarning, TeluguOne]