కరోనా ఫోర్త్ వేవ్ కు సంకేతమా...

 

కరోనా పుట్టిల్లు షాంఘై లో లాక్ డౌన్ ఆక్షలు కటి నంగా అమలు చేస్తున్నట్లు సమాచారం.ఇంటి నుండి బయటకు రావద్దని పౌరులకు నిబందనలు అమలు చేస్తున్నారు.మార్చి 28 నుండి చైనా లోని బీజింగ్ లో కోరోనా వైరస్ లాక్ డౌన్ అమలు చేస్తోంది .అయితే మొదటి వేవ్, రెండవ వేవ్ లోఅంటే   రెండేళ్ళ వరకు చైనాలో కోరోనా పరీక్షలు నియంత్రించారు. అయితే కోరోనా ఉప్పెనలా ముంచుకు వస్తూ ఉండడం తో అది ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న సందేహం వ్యక్తం అవుతోంది. ప్రపంచం లో జీరో కోవిడ్ స్టేటర్జీ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.చైనా లోని అతి పెద్ద నగరం షాంఘై మంగళ వరం నుంచి తొలి విడత కోవిడ్ లాక్ డౌన్ బ్యాన్ ను ఖచ్చితంగా అమలు చేస్తున్నారా? అసలు చాలామంది ప్రజలు సాయంత్రం వేళల్లో వారి వారి పెంపుడు జంతువులు సైతం తీసుకు రావద్దని ఇంటి నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విదిస్తున్నారు.గత రెండు రోజులుగా షాంఘై సమీపం లోని వ్యురాంగ్ జిల్లలో నివసిస్తున్న వారిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు. కోవిడ్ పరీక్షలకు మాత్రమే అనుమతించారు.షాంఘై లో4,477 కేసులు బయట పడడం తో కోవిడ్ ఆంక్షలు మరింత కటిన తరం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో కొత్త కోవిడ్ కేసులు మరణాలు తగ్గు ముఖం పట్టాయని అధికారులు వెల్లడించారు. మార్చ్ 2౦ నుంచి 4,6౩8 కేసులు ఉన్నట్లు గుర్తించారు.ప్రపంచ దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉండడం తో 4వ విడత కోరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయాని నిపుణులు విశ్వసిస్తున్నారు.ఒమైక్రాన్  ఇన్ఫెక్షన్ ఒక ఉప్పెనలా ముంచుకొస్తుందని దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకి ఇప్పటికే న్యూజీలాండ్,సౌత్ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలలో ఒక్కనెలలోనే అధిక సఖ్యలో ఇన్ఫెక్షన్ బారిన పడ్డట్లు సమాచారం.

భారత్ లో మరో వేవ్ తప్పదా?...

ఇప్పటికే ఆశియాలో ఒమైక్రాన్ ప్రభావం చూపడం తోభారత్ లోనూ మరో గండం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే రెండు విడతల కోరోనా వేవ్ ను చవి చూసిన మనం గతం లో కోవిడ్ భారిన పడ్డ ప్రాంతలాలో ఇప్పుడిప్పుడే కంటైన్మేంట్ జోన్లను ఎత్తివేసింది. గతవారం లో మాస్క్లు లు,సాని టైజర్లు కూడా వాడడం భారత్ లో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇతర దేశాలాలో  స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ కెసులు పెరుగుతూ ఉండడం తో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమయ్యింది. ఈమేరకు వివిధరాష్ట్ర్రాల,కేంద్ర పాలిత ప్రాంతాలలోని  చీఫ్ సేక్రట రీలకు కేంద్ర హోంమంత్రిత్వ కార్యదర్శి అజయ్ భల్ల లేఖలు రాసారు అయితే 24 నెలలుగా వృద్ది సాధించామని భారత్ కు ప్యాం డమిక్ ను  ఎలా ఎదుర్కోవాలోనిర్ధారణ, అలాగే,నిఘా, కాంటాక్ట్,ట్రేస్,ట్రీట్, వ్యాక్సినేషన్ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, పెంచినట్లు తెలిపారు.సాధారణ ప్రజానీకం సైతం కోవిడ్ పై అవగాహన వచ్చిందని కోవిడ్ ఎలాప్రవర్తిస్తుందో రాష్ట్ర్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయం ప్రతి పత్తి ని సాధించాయి అని అజయ్ భల్ల పేర్కొన్నారు కాగా పరిస్థితి ఎలాఉన్నా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని కోరోనా నియంత్రణ చర్యలు పాటించడం అవసరమని ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భల్ల అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం.

భారత్ కు నాల్గవ వేవ్ వస్తే సామాన్యుడి గతి ఏమిటి? ఈ ప్రశ్నకు ప్రభుత్వాలు చెప్పే సమాధానం ఏమిటి?    

కోవిడ్ వల్ల ఎన్నో కుటుంబాలు అయిన వాళ్ళను కోల్పోయారు. నేటికి ఆ వ్యక్తి లేని కొరతను అధిగమించేందుకు సతదా ప్రయ్యత్నిస్తున్నారు.అయినప్పటికీ పూర్తిగ్గా అవగాహన లేక,ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో తెలియక, కోవిడ్ చికిత్సలు ఎక్కడ చేస్తారో తెలియక ఆసమాచారం  లేక చూస్తూ చూస్తూ తమ వాళ్ళను కళ్ళముందే పోగొట్టుకుని కుమిలిపోయిన బాధిత కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో,కొనబోతే కొరివి,అమ్మబోతే అడివి అన్న చందాన అకాసాన్ని తాకిన ధరలు ఒకవైపు,ముంచుకొస్తున్న కోరోనా తూఫాన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇబ్బంది పడుతూ సూన్యం లోకి చూస్త్హూ ఏమిచేయాలో తెలియక దారి తెన్ను లేని జీవితాన్ని బతికేస్తున్న సగటు సామాన్యుడి గోడు పట్టదు.ఒకవైపు చికిత్సల ఖర్చు మరోపక్క మందుల ధరలూ పెరిగి పోవడం తో సగటు మధ్య తరగతి కి వైద్యం అంతంత మాత్రం గానే అందుతుంది.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఎవరికీ పట్టని రోగి. జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ రోగి వస్తే చేసే చికిత్స ఏమిటో చెప్పరు అసలు రోగి స్థితిని చెప్పే నాధుడే ఉండదు.
అసలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తిరిగి వస్తామో లేదో అన్నదే సామాన్యుడి సందేహం ప్రభుత్వాలు సైతం భరోసా ఇవ్వని చికిత్సలు ఇక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం కన్నా కాటికి పోవడం సులభం అని అనుకుంటున్న సామాన్యుడి గోడు ప్రభుత్వాలకి వినపడదు కన పడదు.రెండేళ్ళ ప్యాం డమిక్ ను చూసి అయినా సామాన్యుడికి ఉచిత వైద్యం ఇచ్చే ప్రణాళిక లేకపోవడం. మౌలిక సదుపాయాలు సైతం లేక పోవడం గమనించ వచ్చు కేంద్ర రాష్ట్ర ప్రణాళికలో సామాన్యుడి ఆరోగ్యానికి ఒక్క పైసా కేటాయింపులు లేకపోగా అసలు ఎ ఎ చికిత్సలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలాకి ఖర్చు చేస్తున్నాయి ఎంత ఖర్చు చేస్తున్నాయి అన్నకేటాయింపులు లేకపోవడం చూస్తే సామాన్యుడి ఆరోగ్యం పై ఎంత శ్రద్దో తెలుస్తుంది.
వ్యాక్సిన్లుఅమ్ముకున్నారు రెమిడీ సివిర్ ఇంజక్షన్ బ్లాక్ లో అమ్ముకున్నారు సాధారణ పెరాసిట్ మాల్, ఇతర మందుల దరలు పెంచేసి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని  ప్రైవేటు పరం చేసిందని కేంద్రం చెప్పకనే చెప్పింది ఇక 4వ విడత కోరోనా వస్తే మాన్యులసంగతి దేముడికి ఎరుక, సామాన్యుడి సంగతి తలుచుకుంటేనే భయం వేస్తుందని సగటు సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.