గ్యాస్ సిలెండర్ ధర కొద్దిగా పెరిగింది

 

సబ్సిడీ వంట గ్యాస్ ధర సిలిండర్‌కు మూడు రూపాయలు పెరిగింది. 14.2 కేజీల సిలిండర్‌పై డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్‌ను 40.71 రూపాయల నుంచి 43.71కు కేంద్రం పెంచడంతో ఆ మేరకు వంట గ్యాస్ సిలిండర్ ధరను మూడు రూపాయలు పెంచారు. ఈ పెంపుతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర 414 నుంచి 417కి పెరగగా ముంబైలో 448.50 నుంచి 452కి పెరిగింది. సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల కోటాను దాటి కొనుగోలు చేసేవి) 14.2 కేజీల సిలిండర్ ధర సైతం అదే స్థాయికి పెరిగింది. ప్రస్తుతం 880 రూపాయలుగా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర 883.50కి చేరింది. గ్యాస్ డీలర్ల కమిషన్ పెంపు కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 13,896 మంది పంపిణీదారులకు స్వల్ప లాభం చేకూరనుంది.