రాజయ్య ఇంటి ముందు ధర్నా..



కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య ఇంటి ముందు మహిళా సంఘాలు ధర్నాచేపట్టారు. రాజయ్య కుంటుంబ సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంటి ముందు కూర్చొని నినాదాలు చేపట్టారు. సారిక మృతికి భర్త వేధింపులే కారణమని.. పోలీసులు అనవసరంగా కాలయాపన చేస్తున్నారని.. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు గ్యాస్ లీకేజ్ అయి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది హత్యా?లేక ఆత్మహత్యా? అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu