ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ముంచారు.. రాహుల్ గాంధీ

 

ఏపీ ప్రత్యేక హోదా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆపార్టీ నేతలు కలిశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం సేకరించిన కోటి సంతకాల పత్రాలను వారికి అందజేశారు. ఈసందర్బంగా సోనియా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నేతలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా.. విభజన చట్టంలో ఏపీకి పలు హామీలు ఇచ్చాం.. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ.. రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజి.. పోలవరంకి జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చాం.. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదు.. ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుంది అని అన్నారు.


ఇంకా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ముంచారు.. ఏపీ ప్రత్యేక హోదాపై మన్మోహన్ సింగ్ హామి ఇచ్చారు.. విభజన చట్టంలో హామీలు నెరవేర్చడానికి పోరాడుతున్నాము.. ఏపీకి న్యాయం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu