చంద్రబాబును అభినందించిన వీహెచ్

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ భేటీలో చంద్రబాబు తెరాసను గద్దె దింపటమే ప్రధాన లక్ష్యమని సీట్ల విషయంలో సర్దుకుపోవాల్సిందిగా నేతలకు సూచించారు.కేసీఆర్‌ను గద్దె దించేందుకు సీట్ల త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు.సీపీఐ, టీజేఏస్‌ కూడా ఇదే తరహా ఆలోచనచేసి సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.కేసీఆర్‌ ఎంతతిట్టినా బాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని,అది ఆయన విజ్ఞతకు నిదర్శనమని కొనియాడారు.

బీసీలకు సీట్ల కోటాయింపుపై ఢిల్లీలో జరుగుతున్నచర్చలపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు.చర్చలకు తనను పిలవలేదని,రాష్ట్రంలో తనకంటే పెద్ద బీసీ నాయకుడు ఎవరున్నారని ప్రశ్నించారు.దీనిపై  స్క్రీనింగ్ కమిటీ భక్త చరణ్ దాస్ ను, పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను వివరణ అడుగుతానన్నారు.బీసీ సాధికారత కమిటీ ఏ రాష్ట్రంలో లేదు.ఇక్కడ ఎందుకు పెట్టారు? ఎస్సీ, ఎస్టీ సాధికారత కమిటీ ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు.ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు అడుగుతున్నామన్న వీహెచ్ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.