కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరంటే..?
posted on Mar 9, 2025 7:34PM

తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్ నాలుగు స్థానాలను గెలుచుకోవడం ఖాయం. అయితే వీటిలో ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది. ఇక మిగిలిన ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆదివారం (మార్చి 10) ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ లకు ఎంపిక చేసింది. ఈ మూడు స్థానాలలో ఒక ఎస్సీ, ఒకటి ఎస్టీ, మరోటి మహిళకు కేటాయించి.. అన్ని వర్గాలకు అవకాశం కల్పించింది.
గత కొంత కాలంగా పార్టీలో ఉండీ లేనట్లుగా కనిపించిన విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా టికెట్ కేటాయించింది. అదే విధంగా గత కొంత కాలంగా అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకడు అద్దంకి దయాకర్ కు ఈ సారి పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి టికెట్ ఖరారు చేసింది. దీంతో చట్ట సభలో కాలు పెట్టాలన్న ఆయన చిరకాల కోరిక నెరవేరనుంది.