బూతుల పంచాగంలో నాని, రోజా పోటీపోటీ!

 రోజా... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా పక్కాగా చెప్పాలంటే మాత్రం..  శివకాశీ ఫైర్ బ్రాండ్. వెండి తెర మీద హీరోయిన్‌గా ఎంత వెలుగు వెలిగిందో.. బుల్లి తెరపైన బుల్లి బుల్లి కామెడీ షోల్లో జడ్జిగా, అలాగే బతుకు జట్కా బండి తదితర కార్యక్రమాల్లో పెద్దరాయుడిగారి చిన్న చెల్లిలా  కూడా బాగానే పాపులర్ అయ్యారు.   అయితే 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమె స్పీడ్ పెరిగిందనీ.. కానీ జగన్ మలి కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..   రోజా.. ఫైర్ బ్రాండ్‌లకే బ్రాంగ్ అంబాసిడర్ గా  తయారైందనే ఓ టాక్ అయితే  వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు ఫ్యాన్ తిరిగినట్లు గిర గిరా తిరుగుతోందని అంటున్నారు. 

ఆ క్రమంలో   రోజా వ్యవహార శైలి పట్ల వైసీపీ నేతలే కాదు,  కేడర్ సైతం ఒకింత అసహనం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. తాజాగా విశాఖ గర్జన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రి ఆర్కే రోజా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తీరును చూసి ఎయిర్ పోర్ట్ సిబ్బంది సైతం తీవ్ర విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక రోజా తీరు పట్ల సోషల్ మీడియాలో  నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. 

జగన్ తొలి కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్  , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై బూతులు వర్షం కురిపించినట్లుగా.. జగన్ మలి కేబినెట్‌లో  రోజా వ్యవహరిస్తున్నారన్న ఓ చర్చ సైతం రాజకీయ వర్గాలలో, జన బాహుళ్యంలో వాడి వేడిగా నడుస్తోంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లను తిట్టిపోయడంలో జగన్ పార్టీలో కొడాలి నాని, ఆర్కే రోజా ఇద్దరు   పోటీ పడుతున్నారని ఇప్పటికే.. ప్రజలకు ఓ క్లియర్ కట్‌గా అర్థమైపోయిందని తెలుస్తోంది. అదీకాక.. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై  అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత  రోజా.. మీడియా సాక్షిగా మాట్లాడుతూ.. కొడాలి నానిని ఆయన వ్యాఖ్యలను సమర్థించడం పట్ల.. ప్రపంచంలోని తెలుగు వారంతా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఓ వైపు ఆర్కే రోజా వ్యవహర శైలిపై తెలుగు ప్రజలు ఆక్షేపిస్తుంటే.. మరోవైపు ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఆర్కే రోజాను ఆసమ్మతి నేతలు గురి చూసి కొడుతున్నారు. దీంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం తెలిసింది. 

అందులోభాగంగానే నగరి నియోజకవర్గంలోని నిండ్రం మండలం కొప్పేడులో రైతు భరోసా కేంద్రంతోపాటు వెల్‌నెస్ నెంటర్‌కు భూమి పూజ నిర్వహించారీ అసమ్మతి నేతలు. ఈ విషయం తెలిసి.. ఆర్కే రోజా.. ఆగ్రహంతో రగిలిపోయి.. కన్నీరు మున్నీరు అవుతూ.. ఓ ఆడియోను లీక్‌ చేసి.. ప్రజల్లోకి వెళ్లేలా చేశారనే చర్చ సైతం నగరి నియోజకవర్గంలో గట్టిగా ఊపందుకొంది. 
ఇదంతా ఆర్కే రోజా స్వయంకృతపరాధమని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రస్తుత నగరి నియోజకవర్గంలోని అయిదు మండాలలకు చెందిన అసమ్మతి నేతలంతా.. గతంలో ఆమె గెలుపు కోసం ప్రాణాలు పణాం పెట్టి కృషి చేశారని.. ఆమె వరుసగా రెండో సారి ఎమ్మెల్యే అయిన తర్వాత వారిని దూరంగా పెట్టిందని సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్రంగా హర్ట్ అయిన వారు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వద్దకు వెళ్లి.. ఆర్కే రోజా వ్యవహరిశైలిని... కళ్లకు కట్టినట్లు వివరించడంతో.. ఈ పంచాయతీని ఆయనే స్వయంగా తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దల వద్దకు తీసుకు వెళ్లి.. వారికి కీలక పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. 

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహార శైలికి నిరసనగా ఆమెను నియోజకవర్గ ప్రజల దూరంగా పెడితే... ఓ రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. బూతులు మాట్లాడడం, వెకిలి చేష్టలు చేయడం... బూతులు మాట్లాడే వారిని సమర్థించడం చేయడంలాంటివి చేస్తే.. ఆర్కే రోజా రాజకీయ భవిష్యత్తుకు ప్రజలు పుల్ స్టాప్ పెడతారనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలో జోరుగా హుషారుగా నడుస్తోంది. ఏదీ ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో ఆర్కే రోజా ముచ్చటగా మూడో సారి నగరిలో గెలుపు నల్లేరు మీద నడక కాదని సుస్పష్టం అవుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu