లబ్ధిదారులపై దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ పై చర్యలు

తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో జమకాలేదని అన్నందుకు లబ్ధిదారులపై దాడికి పాల్పడిన డిజిటల్ కలెక్టర్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా వడిగల వారి పల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బాబా ఫక్రుద్దీన్ తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో పడలేదేంటని ప్రశ్నించిన గండువారిపల్లికి చెందిన అనురాధ ఆమె భర్త శంకర్  వారి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు.

ఈ సంఘటన బుధవారం (జూన్ 18) జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జూన్ 19)న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం (జూన్ 19) బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. డిజిటల్ అసిస్టెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి ధైర్యం చెప్పారు.   ఆ డిజిటల్ అసిస్టెంట్ పై శాఖపరమైన అన్ని రకాల చర్యలే కాకుండా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.  బాధిత  కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.