తను ప్రత్యర్ధి.. ఎలా ఫోన్ చేస్తా



ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో విద్యుత్ ఉద్యోగుల రిలీవింగ్ పై వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఇరు రాష్ట్రాలలో విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్‌.. జగన్ కు ఫోన్ చేసి ఈవిషయంపై కేటీఆర్ తో మాట్లాడాలని.. సూచించారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈవార్తలను సీఎం రమేశ్ ఖండించారు. తాను జగన్ కు ఫోన్ చేయలేదని.. అసలు జగన్ తో మాట్లాడాల్సిన అవసరం ఏంటని? ప్రశ్నించారు. మేము కడప జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులం.. అలాంటిది ఆయనకు నేను ఫోన్ ఎలా చేస్తాను..ఫోన్‌ చేయలేదు. మాట్లాడలేదు.. ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. అయితే ఈ విషయంపై విద్యుత్ ఉద్యోగులు నన్ను ఢిల్లీలో కలిశారు.. aవారిని నేను కేంద్రమంత్రి దగ్గరికి తీసుకెళ్లి సమస్యను వివరించాను అని తెలిపారు.