త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, కొత్త పార్టీ

 

పార్టీకి, పదవికి రాజీనామ చేసిన కాంగ్రెస్ శాసన సభ్యుడు వీరశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గనుక రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని పునరాలోచించక పోయినట్లయితే త్వరలో సీమంధ్రలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అంటే, కాంగ్రెస్ గనుక విభజనకే మొగ్గు చూపితే బహుశః ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని ఆయన సూచిస్తున్నట్లు భావించవచ్చును. నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతిలో చేసిన ప్రసంగం కూడా అదే సూచిస్తోంది.