వారికి కూడా తెలంగాణవారితో సమాన హక్కులు
posted on Sep 21, 2015 11:06AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో కేరళ భవనాన్ని నిర్మిస్తానన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో కేరళ భవనాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని.. తెలంగాణకు.. కేరళకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని అన్నారు. ప్రతిఒక్కరితో కలిసిపోయే తత్వం మలయాళీల లక్షణంగా చెప్పిన కేసీఆర్.. కేరళవారిని తెగ పొగిడేశారు. అంతేకాదు తెలంగాణలో ఉన్న మలయాళీలంతా తెలంగాణ వారే అని.. తెలంగాణ వారితో సమానంగా మలయాళీలకు కూడా సమాన హక్కులు ఉంటాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో 350 పేద మలయాళీల కుటుంబాలు ఉన్నాయని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.