శాసన సభలో మండలి కొనసాగుతుందా లేదా... ఉత్కంఠతను రేపుతున్న నేడు తుది నిర్ణయం....

మండలి రద్దు జరగాలని సీఎం జగన్ నేడు అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు.ఏపీ శాసన సభలో మండలి అంశం పై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి ముందు సచివాలయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమవుతుంది. శాసన మండలి భవితవ్యం ఇక్కడే తేలిపోతుంది. అధికార పక్షం అనుకున్నట్టుగా బలం వస్తే ప్రతి పక్షం నుంచి పాలకపక్షానికి ఎమ్మెల్సీల వలసవస్తే శాసన మండలి సురక్షితంగా ఉంటుందని లేదంటే కౌన్సిల్ రద్దవుతుందని రాజకీయ వర్గాల సమాచారం.మంత్రి వర్గ సమావేశంలోనే ప్రభుత్వ నిర్ణయం ఏమిటనేది తేలిపోతుందని అంటున్నారు. కౌన్సిల్ రద్దు చేయాలనుకుంటే మంత్రి వర్గ సమావేశంలోనే దాని పై తీర్మానం చేస్తారు. 99% శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే జగన్ ఉన్నారని ఒక మంత్రి వ్యాఖ్యా నించారు.ఆశించిన స్థాయిలో చేరిక లుంటే మాత్రం ఆయన పునః ఆలోచించాల్సి ఉంటుంది.  సీఆర్ సీఆర్డీఏ రద్దు రాష్ట్రంలో అధికార పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసన మండలి లో చోటు చేసుకున్న పరిణామాలతో అధికార పక్షం విస్తుపోయింది. 

శాసనసభలో 175 స్థానాల్లో 151 స్థానాలతో 80% శాతం పైగా సభ్యులను కలిగి బిల్లులనూ ఆమోదిస్తే శాసన మండలిలో తిరస్కరణకు గురి కావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఈ నేపధ్యంలోనే శాసనమండలిని రద్దు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారని అధికార పక్షం చెబుతోంది.దీని పై మంత్రి వర్గంలో తీసుకునే వైఖరికి అనుగుణంగా అసెంబ్లీలో సీఎం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.ఒకవేళ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపితే అది వైసీపీకే ఎక్కువ నష్టమని విపక్షాలు వాదిస్తునలు వినిపిస్తున్నాయి.ఏడాది తర్వాత శాసన మండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యులలో అధికులు రిటైర్ అవుతున్నారు. 2021,2023 లో జరిగే ద్వై వార్షిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ సభ్యులు ఒక్కొక్కరుగా రిటైరవుతుంటే ఆ స్థానాల్లో వైసీపీ సభ్యులు భర్తీ అవుతారు. వైసీపీ శాసన సభ్యు లకు దీటైన స్థాయిలో ఉన్న నేతలకు శాసన మండలిలో స్థానం కల్పించడం ద్వారా నేతలందరికీ పదవులు ఇచ్చి సంతృప్తిపరిచేందుకు వీలు కలుగుతుంది.ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి పార్టీ ముఖ్య నేతలు వివరిస్తున్నారు.శాసనమండలి రద్దయితే పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ లాంటి పటుత్వం ఉన్న వారు తమ ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోతారు. వారి కోసం ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ స్థానా లు ఖాళీ చేసి 6 నెలల్లో వాటికి ఎన్నికల జరిగితేనే వారు మంత్రి వర్గంలో కొనసాగే వీలు ఉంటుంది.టిడిపి ఎమ్మెల్సీలు ప్రాతి నిథ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని కొందరు టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజక వర్గ కార్యకర్తలకు ఫోన్లు చేశారని వెల్లడించారు.మొత్తం మీద మరికాద్ది గంటల్లో వెలువడనున్న సమావేశంతో మండలి రద్దు అంశంకు తెర పడనుంది.