నా జీవితంలోనే ఎపుడూ చూడలేదు.. చంద్రబాబు


భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలైపోయింది. ఈ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాఫ్టర్ ద్వారా జిల్లాను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన నెల్లూరుజిల్లాలో సంభవించిన వర్షాలకు ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. పర్యవేక్షణ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఇలాంటి వర్షం తన జీవితంలోనే ఎపుడూ చూడలేదని ఆయన అనడం గమనార్హం. అంతేకాదు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ వర్షాల గురించి ప్రధానికి వివరించారు. అయితే... వర్షసూచన తెలియడంతో ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడం.. జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం బాగా తగ్గింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu