పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
posted on Aug 6, 2025 6:43PM
.webp)
రాష్ట్రంలో మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. అర్హులైన నాయీ బ్రాహ్మణులకు చెందిన హెయిల్ సెలూన్లకు ఫ్రీ కరెంట్ అమలు చేయాలని మంత్రులు నిర్ణయించారు. 40వేల హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుండి నూతన రేషన్ కార్డులు పంపిణీకి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు. ఏపీ టూరిజంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని.. అరకు, భవానీ ఐలాండ్స్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు.
రూ.900 కోట్ల ఏపీ బీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైష్ణవి ఇన్‌ఫ్రా కంపెనీకి 25 ఎకరాల టీటీడీ భూమిని ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచామన్నారు. 40వేల హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఫార్చ్యూన్-500 లిస్టులోని ఐటీ సంస్థలకు తక్కువ ధరకే భూములపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.