TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఐఐ సదస్సు: తొలి రోజు ఎంవోయూల విలువెంతో తెలుసా.?

Published on: Fri Nov 13, 2026 2:25PM

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి విశాఖ వేదికగా జరుగుతున్న   31వ సీఐఐ  భాగస్వామ్య సదస్సు చేరువ చేస్తున్నది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు తొలి రోజునే అంటే గురువారం (నవంబర్ 12) అద్భుత  ఫలితాలను సాధించింది. ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు పాల్గొన్న ఈ సదస్సులో   మొదటి రోజే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ప్రవహించాయి. పారిశ్రామిక, హరిత ఇంధన, ఆటోమొబైల్, ఇన్ ఫ్రాస్ట్రకచ్చర్  రంగాలలో భారీగా పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎంవోయూలపై సంతరాలు చేశారు. 

ఈ సదస్సు తొలి రోజు  రాష్ట్రంలోకి ఏకంగా 5.84 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.  మొత్తం 88కి పైగా కీలక ఒప్పందాలు    కుదిరాయి. ఇందులో భాగంగా 73 అవగాహన ఒప్పందాలు,  15 ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి. ఈ పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల  1.07 లక్షల ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వసతులు, పారదర్శక విధానాలను వివరించారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి పెట్టుబడిని గ్రౌండ్ అయ్యేలా చూస్తామని, ప్రభుత్వం  నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. దీంతో దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు  ముందుకు వచ్చారు.

ఈ భారీ పెట్టుబడులలో ప్రధానంగా తయారీ రంగం, విద్యుత్ వాహనాలు,  రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్,  డిఫెన్స్ రంగాలు పెద్ద ఎత్తున నిధులు ఆకర్షించాయి. కడప జిల్లా కొప్పర్తి, తిరుపతి,  విశాఖపట్నం కేంద్రంగా పలు ప్రముఖ కంపెనీలు తమ యూనిట్ల విస్తరణకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర హరిత ఇంధన లక్ష్యాలకు ఎంతో ఊతమిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ప్రభుత్వంతో మంచు మనోజ్ భార్య ఎంవోయూ: సీఐఐ వేదికగా సంతకాలు.!

గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సులభతర వ్యాపార విధానాలు ,   వేగవంతమైన అనుమతుల ప్రక్రియే పెట్టుబడులు ఈ స్థాయిలో వెల్లవెత్తడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తుండటం పట్ల సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులు సైతం హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌లు కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అంచనా వేస్తున్నారు.

మొదటి రోజు లభించిన ఈ అఖండ స్పందనతో  సదస్సు ముగిసేనాటికి ఈ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే అధికంగానే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ అభివృద్ధి ద్వారా రాష్ట్రంలోని యువతకు స్థానికంగానే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు లభించి, రాష్ట్రం ఆర్థికంగా మరింత బలపడటానికి ఈ సదస్సు మైలురాయిగా నిలవనుంది.

మీకు నచ్చవచ్చు: అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ: శాశ్వత్ గోయెంకాకు మంత్రి లోకేష్ ప్రతిపాదన.!

ఏపీలో ల్యాప్‌టాప్, సర్వర్ తయారీ యూనిట్: లోకేష్ ప్రతిపాదనకు డిక్సన్ టెక్నాలజీ సానుకూల స్పందన.!

[CIISummit,  Visakhapatnam, MOUs, 1stday, CBN, Lokesh, Pawan, TeluguOne]