ఆర్జీవీకి సిఐడి  మరో సారి నోటీసులు 

వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు  ఇచ్చారు. . 2019లో ఆయ‌న తీసిన‌ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'  చిత్రంపై కేసులు  నమోదైన సంగతి తెలిసిందే.   గతంలో సిఐడి అధికారులకు కూడా ఫిర్యాదులు వచ్చినప్పటికీ  పట్టించుకోలేదు. తాజాగా  సిఐడి అధికారులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి గత నెల 10వ తేదీన విచారణకు రావల్సిందిగా సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు.  నోటీసులు అందుకున్న వర్మ వారం రోజుల గడువు కావాలని కోరారు. చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్నట్లు చెప్పారు. వారం రోజుల తర్వాత   కూడా వర్మ సిఐడి విచారణకు  డుమ్మా కొట్టారు. దీంతో సిఐడి అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. 
2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. . అయితే ఈ చిత్రం టైటిల్ వివాదాస్పదం కావడంతో  కొందరు తెలంగాన హైకోర్టు నాశ్రయించారు.  దీంతో టైటిల్ మార్చి  'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే పేరుతో సినిమాను విడుదల  చేశారు. అయితే, యూట్యూబ్ లో మాత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతోనే విడుదల చేశారంటూ  ఆత్మకూర్ కు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని వివాదాస్పద కంటెంట్ ను  కూడా తొలగించలేదని  తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్ లో నిరుడు నవంబర్ 29న కేసు నమోదయింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu