మెగా సినిమా దర్శకుడి కోసం చరణ్ వెతుకులాట
posted on Jul 7, 2014 1:43PM
.jpg)
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ఓటమితో కొంత నిరాశ చెందిన, త్వరలో తన 150వ సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా కోసం మూడు కథలను ఓకే చేసి పెట్టాడట. తన పుట్టినరోజున ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి 150వ సినిమాలో నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఒకవేళ కథలో తన పాత్రకు ఛాన్స్ లేకపోయినా సినిమాలో ఏదో ఒక చోట తనను చేర్చేలా చూడాలని డైరెక్టర్‌ని కోరుతానని రామ్‌చరణ్ చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని చిరంజీవి భార్య సురేఖ తమ సొంత బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేస్తారట. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పైన చేసే మంచి దర్శకుడి కోసం చిరు, చరణ్ అన్వేషిస్తున్నారట.