అసమ్మతి సెగ, ఢిల్లీకి సీఎం కిరణ్
posted on May 4, 2013 12:01PM
.jpg)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనలకు అసమ్మతి సెగ తగిలింది. ఢిల్లీ నుండి అధిష్టానం పిలుపు నివ్వడంతో ఆయన ఈ నెల 6,7,8 తేదీలలో జరగనున్న ఇందిరమ్మ బాట కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఢిల్లీ బాట పట్టనున్నారు. ‘బంగారు తల్లి’ పథకం ఎవరితోనూ చర్చించకుండా ప్రకటించడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, వట్టి వసంత్ కుమార్, జానారెడ్డి తదితరులు ఆగ్రహంగా ఉన్నారు.ఈ మేరకు వీరంతా అధిష్టానానికి ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక శానససభ ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఇక ఈ అసమ్మతితో పాటు పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు 48 గంటల దీక్ష అధిష్టానాన్ని తాకినట్లు తెలుస్తోంది. దీనిని కూడా చర్చించాలన్న ఉద్దేశంతో పాటు ఎన్నికలకు ఏడాది కాలమే ఉన్న నేపథ్యంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.