రేణిగుంట గోడౌన్లలో చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు

ప్రజలను ప్రలోభాలకు గురి చేసి  ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి  తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి. డుగులు, కండువాలు, జెండాలు, ఆమ్ప్లిఫైర్లు, టోపీలు , టీషర్స్ ఉన్నాయి.

ఆ పరిసర ప్రాంతాలలోని మరిన్ని గోడౌన్లలో కుక్కర్లు, ఫ్యాన్లతో పాటు నోట్ల కట్టలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. విషయం బయటపడగానే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మీడియాను అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. వాటన్నిటికీ బిల్లులు ఉన్నాయంటూ అధికారులు చెప్పడంపై తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు.

ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. వెంటనే ఎస్పీ, కలెక్టర్ స్పందించి చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశేషమేమిటంటో ఆ గోడౌన్లో డమ్మీ ఈవీఎంలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికలలో ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడేందుకు వైసీపీ తెగించేసిందో అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.