TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యాక్సెస్ ఈక్వాలిటీలో ఏపీ టాప్: నారా చంద్రబాబు.!

Published on: Fri Nov 13, 2026 1:19PM

టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతి,  భవిష్యత్ ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలను విపులంగా వివరించారు.  విశాఖపట్నంలో   జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ పాల్కి శర్మ నిర్వహించి  ముఖాముఖి కార్యక్రమంలో  పాల్గొన్న చంద్రబాబు   దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని ప్రోత్సహిం చడంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, సవాళ్లు, సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

దేశంలో 90వ దశకం ఆరంభంలో  ఆర్థిక సంస్కరణల తర్వాత ఆలోచనా విధానంలో   మార్పు వచ్చిందన్న ఆయన..  మూడు దశాబ్దాల కిందట తాను  కష్టపడి ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, ఆ కాలంలో ప్రధానులతో సైతం చర్చలు జరిపి టెలికాం రంగంలో సంస్కరణలు వచ్చేలా కృషి చేశానని వివరించారు.   వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్ నేరుగా సేవా రంగం వైపు దూసుకెళ్లడానికి ఐటీ రంగమే ప్రధాన కారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని, గ్లోబల్ కంపెనీలలో భారతీయులు అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్నారని  చెప్పారు.

బిల్ గేట్స్‌ను ఒప్పించి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తొలి అభివృద్ధి కేంద్రాన్ని తీసుకువచ్చిన జ్ఞాపకాలను ఆయన నెమరువేసుకున్నారు. తొలుత రాజకీయ నాయకుడిగా తనను కలవడానికి నిరాకరించిన బిల్ గేట్స్‌ను తన లాప్‌టాప్ ప్రెజెంటేషన్‌తో 45 నిమిషాల పాటు చర్చించేలా ఒప్పించాననీ,  గణితం,  ఆంగ్ల భాష  భారతీయులకు ఉన్న పట్టు టెక్ రంగంలో విజయానికి బలమైన పునాది అయిందని చంద్రబాబు చెప్పారు.  కేవలం ఐటీ మాత్రమే కాకుండా భవిష్యత్తులో అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా మారుస్తామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర రాజధాని అమరావతి  కేవలం నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాదనీ, అద్భుత, ఆధునిక నగరమన్న చంద్రబాబు,  భూసమీకరణ విధానం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా   29 వేల మంది రైతుల సహకారంతో వేల ఎకరాల భూమిని సేకరించి ల్యాండ్ మోనిటైజేషన్ ను  విజయవంతం చేశామని చెప్పారు. అమరావతిలో ఎటువంటి  పైప్‌లైన్ సమస్యలు రాకుండా డక్ట్ సిస్టమ్, గ్రీన్ ఎనర్జీ,  జీరో పొల్యూషన్ విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఈ నగరం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిలుస్తుందన్నారు. 

ఇది కూడా చదవండి:  దేవాంశ్ సినిమాల్లోకి వెడతాడేమోనని భయం: లోకేష్ సరదా వ్యాఖ్యలు తెగ వైరల్.!

సమాజంలో సంపద సృష్టితో పాటు చివరి గడప వరకు సంక్షేమం అందాలనే ఉద్దేశంతో  పీ4 విధానాన్ని తీసుకు వచ్చానని వివరించారు.   ధనికులు మరింత ధనవంతులు కావడం కాకుండా, కింది స్థాయిలోని పేద కుటుంబాలను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

 సంపద సృష్టితో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలు, తల్లికి వందనం, రైతులకు ఆర్థిక భరోసా వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందని వివరించారు. యాక్సెస్ ఈక్వాలిటీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు.

 

మీకు నచ్చవచ్చు: ప్రభుత్వంతో మంచు మనోజ్ భార్య ఎంవోయూ: సీఐఐ వేదికగా సంతకాలు.!

ఏపీలో మారిటైమ్ రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్: ఇండో-పసిఫిక్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా జువ్వలదిన్నె.!


[ChandrababuNaidu,  Palki Sharma Interview, CIIPartnershipSummit, QuantumComputerLaunch, TeluguOne]