TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేవాంశ్ సినిమాల్లోకి వెడతాడేమోనని భయం: లోకేష్ సరదా వ్యాఖ్యలు తెగ వైరల్.!

Published on: Fri Nov 13, 2026 11:47AM

 

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ తన చతుర సంభాషణతో ఆకట్టుకున్నారు. విశాఖలో నిర్వహించిన యంగ్ ఆంధ్ర, థ్రైవింగ్ ఆంథ్ర కార్యక్రమంలో  నటుడు చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ వ్యాపార వేత్త ఉపాసన కొణిదెలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారిరువురూ రాజకీయాలు, కుటుంబ, విషయాలతో పాటు పలు అంశాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో లోకేష్ హాస్య చతురత అందరినీ ఆకట్టుకుంది.  ప్రధానంగా  కుటుంబ జీవితం, మహిళా సాధికారణ, మహిళల ఆర్థిక స్వాతంత్రం తదితర అంశాలపై లోకేష్ వెల్లడించిన అభిప్రాయాలు అందరి హృదయాలనూ హత్తుకున్నాయి.  తన  భార్య బ్రహ్మణి తన సంపాదనను ఎప్పుడూ తన వద్ద దాచదని చెప్పారు. అంతే కాదు నా క్రెడిట్ కార్డు బిల్లులు కూడా బ్రహ్మణే చెల్లిస్తుందన్నారు.  

ఇక కుమారుడు దేవాంశ్ గురించి మాట్లాడుతూ.. తన కొడుకు విషయంలో తనకో భయం ఉందని సరదాగా అన్నారు. దేవాంశ్ తన తాత ముత్తాతల ప్రభావంతో  సినిమాల వైపు వెళతాడేమోనన్నదే ఆ భయం అని వ్యాఖ్యానించారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  

దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో  డైనో డీట్స్ పేర ఒక పాడ్‌కాస్ట్,  యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది మేలో మొదలైన   ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు పాతిక ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ లక్షల సంఖ్యలో వ్యూస్ ను సంపాదించింది. కాగా ఇదే కార్యక్రమంలో  తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణిలు తన విజయం వెనుక ఉన్న ఇద్దరు శక్తిమంతమైన మహిళలని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇది కూడా చదవండి:  విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!

తన జీవన పయనంలో వారిరువురూ తనకు అండగా నిలిచారన్నారు.   తన తండ్రి రాజకీయాలతో బిజీగా ఉన్న సమయంలో తల్లి భువనేశ్వరి తనకు  మార్గదర్శనం చేస్తూ, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేలా ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.

అలాగే, తాను చేపట్టిన కఠినమైన పాదయాత్ర సమయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా బ్రాహ్మణి తన వెన్నంటి నిలిచి ధైర్యం నూరిపోశారని చెప్పారు. వారాంతపు సెలవులు లేకుండా సాగిన తన  సుదీర్ఘ పాదయాత్ర విజయవంతం కావడం వెనుక   బ్రాహ్మణి అందించిన మానసిక స్థైర్యమే ఉందన్నారు.  

మీకు నచ్చవచ్చు: ఐసీసీ సదస్సు వేదికగా పవన్ తో లోకేష్ భేటీ: రాష్ట్ర పారిశ్రామిక పురోగతిపై చర్చ.!

ఏపీలో ల్యాప్‌టాప్, సర్వర్ తయారీ యూనిట్: లోకేష్ ప్రతిపాదనకు డిక్సన్ టెక్నాలజీ సానుకూల స్పందన.!

[Naralokesh, YoungAndhra, ThrivingAndhra, Devansh, CinemaActor, Podcast, TeluguOne]