చంద్రబాబుకి భువనేశ్వరి దిష్టి తీయాలి!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి కీలకమైన వ్యక్తిగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబుకు ఏర్పడిన పలుకుబడిని చూసి జగన్ అండ్ దండుపాళ్యం బ్యాచ్ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. మెటికలు విరుస్తూ దిష్టి పెడుతున్నారు. లోకల్‌గా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చాలామంది ఆయనకు దిష్టిపెడుతున్నారు. నరుడి దృష్టికి నాపరాళ్లే పగులుతాయి.. నారా వారు కూడా అందుకు మినహాయింపేమీ కాదు.. అందువల్ల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆయనకు అప్పుడప్పుడు దిష్టి తీయాల్సిన అవసరం వుంది. దిష్టి తీసేటప్పుడు ఆమె ఏమని అంటూ దిష్టి తీయాలంటే....

‘‘ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. ఊళ్లోవాళ్ళ దిష్టి.. జగన్ దిష్టి, జగన్ దండుపాళ్యం బ్యాచ్ దిష్టి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దిష్టి, కేసీఆర్ దిష్టి, కేసీఆర్ ఫ్యామిలీ దిష్టి, కాంగ్రెస్ వాళ్ళ దిష్టి, రాష్ట్రంలో, కేంద్రంలో కొంతమంది బీజేపీ వాళ్ళ దిష్టి, మమతా బెనర్జీ దిష్టి, నితీష్ కుమార్ దిష్టి, కొంతమంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిష్టి’’ అంటూ దిష్టి తీయాలి. ఎందుకంటే, చంద్రబాబు క్షేమంగా వుండాలి. ఆయన కోసం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu