మోదీ భారత్ ను అమెరికాల మారుస్తారట!
posted on May 21, 2014 1:39PM
.jpg)
మోదీ విజయంతో దేశంలో ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం కోసం మోదీ ఎంత కృషి చేశారో చెప్పడానికి తన వద్ద అక్షరాలు లేవన్నారు. "నేను ఎంతోమంది నేతలను చూశానుగానీ.. మోదీలో ఉన్న పట్టుదల, ఉత్సాహం మాత్రం అసాధారణం'' అని కితాబునిచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, దేశానికి మంచి భవిష్యత్తు ఉన్నదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం అమెరికా, చైనా దేశాల మాదిరి అగ్రదేశంగా మారుతుందన్నారు. ఈ ప్రమాణ స్వీకారంతో అంతా ముగిసినట్లు కాదని, ఆయన నాయకత్వంలో ఇలాంటి ప్రమాణ స్వీకారాలెన్నో జరగాలని, 2019లో కూడా మోదీయే ప్రధానమంత్రి కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.