చంద్రబాబు మోడీల భేటీ తేదీ ఖరారు

 

ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీల భేటీ ఈ రోజు జరగాల్సిన నేపథ్యంలో కొన్ని అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. అనుకొని పరిస్థితుల్లో సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో భేటీ కాస్త వాయిదా పడింది. అయితే కేంద్రం తదుపరి భేటీకి ఈనెల 25 లేదా 28, 29, 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ఢిల్లీకి రావచ్చని తెలిపింది. దీంతో చంద్రబాబు నాయుడు ఈనెల 25న భేటీకి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఏపీలో అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. అందులోను మోడీ బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరీ ఏపీ ప్రత్యేక హోదాపై చర్చలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో చంద్రబాబు కూడా ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యమైందని భావించే 25వ తేదీనే సమావేశానికి ఎంచుకున్నారు.
 


మరోవైపు ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదాపైన ఇంకా ఏపీకి కావలసిన అవసరాలపై చంద్రబాబు తగిన ముసాయిదాను తయారుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపైన  అంతేకాదు ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు ఏపీకి ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ప్రధానితో బాబు చర్చించాలని.. ఈ మేరకు మోడీని కూడా ఒప్పించాలని నిర్ణయం తీసుకన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రత్యేక హోదా విషయంలో ఉత్తరఖండ్ మోడల్ లా ఏపీకి ప్రత్యేక హోదాకాని.. ప్రత్యేక ప్యాకేజీకాని కావాలని కోరనున్నట్టు సమాచారం.