జగన్ గాలి తీసిన చంద్రబాబు..!
posted on Dec 17, 2015 3:31PM

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా మొదలయ్యాయి. ప్రారంభమైన తొలి రోజే అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసేశారు విపక్ష నేతలు. కాల్ మనీ పై రేపు మాట్లాడదాం అంటూ అధికార పక్ష నేతలు ఒకటికి రెండు సార్లు చెప్పిన వినకుండా.. ఈరోజే మాట్లాడదాం అంటూ వైసీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో సజావుగా సాగాల్సిన సభ కాస్త రసాభాసగా తయారైంది. ఇక లాభం లేక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్బంగా చంద్రబాబు వైసీపీ నేతల గాలి తీసేసినట్టు తెలస్తోంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో చాలామంది నేతలు కొత్తవారే కావడం.. అందునా సభకు అడ్డుపడింది కూడా తొలిసారి ఎన్నికైనా వారే కావడంతో..చంద్రబాబు వైకాపాలో జగన్ తో సహా అందరూ సభకు కొత్తవారే కావడం వల్ల ఇబ్బంది తలెత్తుతోందని అన్నారు. అంటే జగన్ తో పాటు జగన్ బ్యాచ్ కు రాజకీయాల్లో అనుభవం లేదని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఎటకారం చేస్తున్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.