రాక్షస జాతిలా ప్ర‌జ‌ల‌ను పీల్చుకుతింటోన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం..

రాక్షస జాతిలా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత కమిషన్ వేయడం ఖాయం.. ఇప్పుడు తప్పు చేసిన వారిపై అప్పుడు చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. ఏపీ ప్రజలు నవరత్నాలను నమ్మి.. నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి.. ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది.. అన్నారు చంద్ర‌బాబు.  

టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు, తనకు పైలట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. ప్రతి టూర్‌లో కోటేశ్వరరావు ముందు వెళ్లేవారన్నారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేసిన విషయాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు.

‘విభిన్న ప్రతిభావంతులకు రూ.500 ఉండే పెన్షన్..3 వేలు చేశాం. చట్ట సభలకు దివ్యాంలను పంపే బాధ్యత నేను తీసుకుంటా!. దివ్యాగులకు రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను’ అని చంద్రబాబు చెప్పారు.