బీజేపీకి చంద్రబాబు సవాల్...

 

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఏపీ ప్రజలతో పాటు అటు మిత్రపక్షమైన టీడీపీ కూడా తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీరుకు నిరసనగా.. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి కూడా విదితమే. అయితే దీనికి గాను బీజేపీ ఇప్పటికే ఏపీకి చాలా ఇచ్చాం... ఇంకా ఎంత ఇవ్వాలని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు బీజేపీకి ఓ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందన్న విషయమై లెక్కలు తీసి చూపాలని... కేంద్రం ఏం చేసిందనే అంశంపై బీజేపీయే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎంత మంజూరు చేశారో ఇప్పటివరకూ చెప్పనేలేదని... బీజేపీ లెక్కలు తీసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News