గవర్నర్ కు క్లాస్ పీకిన కేంద్రం!
posted on Jun 12, 2015 2:01PM

తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని.. తనతో పాటు 120 మంది నేతల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని, గవర్నర్ కూడా ఈ విషయంలో ఏ పట్టించుకోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలను సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కేంద్ర హోం కార్యదర్శి గోయల్‌కు సమర్పించారు. దీంతో కేంద్రం ఈ వ్యవహారంపై స్పందించి విచారణను చేపట్టడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రల గవర్నర్ కు క్లాస్ పీకారని సమాచారం. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛగా, సజావుగా పనిచేసే వాతావరణం కల్పించాలని, రెండు రాష్ట్రాల సీఎంలు ఎవరి పని వారు చేసుకునేలా చూడాలని కేంద్రం గవర్నర్ కు ఆదేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.