అమిత్ షా మిస్సింగ్ ?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తప్పి పోయారా? ఆయన ఎవరికీ కనిపించకుండా పోయారా? అలాంటిదేమీ లేదు న్క్షేపంగా అయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ట్విట్టర్’లో మాత్రం, ‘ అమిత్ షా మిస్సింగ్’ అనే యాష్‌ట్యాగ్‌తో 500కు పైగా ట్వీట్లు గురువారం ఉదయం చక్కర్లు కొట్టాయి.

అంతే కాదు, ఎన్ఎస్‌యూఐ కార్యదర్శి నగేష్ కరియప్ప, కేంద్ర హోమేమంత్రి కనిపించడం లేదని, ఏకంగా పోలీసుకే ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్’లి కరియప్ప, దేశం కరోనా కోరల్లో చిక్కుకున్న సమయంలో, ప్రజలకు అందుబాటులో ఉండి  సేవ చేయవలసిన హోం మంత్రి అమిత్ షా, బాధ్యతల నుంచి తప్పించుకుని పలాయనం చిత్తగించారని కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి నాయకుడు తమ ఫిర్యాదులలో  పేర్కొన్నారు.  

అలాగే, కాంగ్రెస్ యువ నేత రాజకీయనేతలు జవాబుదారీతనంతో ఉండాలని, జవాబుదారీతనం కేవలం భారత ప్రభుత్వానికి, బీజేపీకి మాత్రమే కాదని, దేశ ప్రజల పట్ల తప్పనిసరిగా ఉండితీరాలని అన్నారు. చివరిసారిగా అమిత్‌షా బెంగాల్ ప్రచారంలో కనిపించారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, కరియప్ప ఫిర్యాదుపై విచారించేందుకు. ఎన్ఎస్‌యూఐ కార్యాలయానికి వెళ్ళిన పోలీసులకు కరియప్ప కనిపించలేదు. ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో కూడా తెలియదని సిబ్బంది చెప్పడంతో పోలీసులు ఆకక్దినుంచి వేణు తిరగారు.. ఇంతకీ కనిపించనిది అమిస్త్ షానా, కరియప్ప?