బ్యాంకాక్ లో బాంబు ప్రేలుడులో 27 మంది మృతి
posted on Aug 17, 2015 8:02PM
.jpg)
థాయ్ ల్యాండ్ రాజధాని సెంట్రల్ బ్యాంకాక్ లోని సుప్రసిద్ధ రాచ ప్రసాంగ్ అనే ప్రాంతంలో ఒక హిందూ దేవాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏడు గంటలకు భారీ బాంబు ప్రేలుడు జరిగింది. ఆ ప్రేలుడుకి 12మంది అక్కడిక్కడే మరణించగా మరో 78మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మరో 15 మంది చికిత్స పొందుతూ మరణించారు. బాంబుని మోటార్ సైకిల్ పై అమర్చి దేవాలయం సమీపంలో నిలిపి ఉంచి బాగా రద్దీగా ఉన్న సమయంలో ప్రేలుడు జరపడంతో చాల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 15మంది చనిపోయారు. ఆలయాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు మరో బాంబుని కనుగొని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది, లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. థాయ్ ల్యాండ్ లో కొందరు ముస్లిం తీవ్రవాదులు అప్పుడప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడుతూ తమ ఉనికిని చాటుకొంటున్నారు. బహుశః వారే ఈ ప్రేలుళ్ళకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరూ ఆ ప్రేలుళ్ళకు తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.