ఉదయ్ కిరణ్ మృతికి సినీ ప్రముఖుల నివాళి

 

 

 

సినీ నటుడు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉదయ్ కిరణ్ పార్ధివదేహాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు. దర్శకుడు దాసరి నారాయణరావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, చలపతిరావు, నటి జయసుధ, అశోక్ కుమార్, వరుణ్ సందేశ్, ఎంఎస్ రాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేష్, సురేష్ బాబు, రామానాయుడు, శ్రీకాంత్, శివాజీ రాజా, దర్శకుడు సముద్ర, అనూప్ రూబెన్స్, కాదంబరి కిరణ్ కుమార్, బెనర్జీ తదితరులు ఉదయ్ కిరణ్కు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

 

హీరో వెంకటేష్ మాట్లాడుతూ...  ''ఉదయ్ కిరణ్ లాంటి మంచి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. చిత్ర పరిశ్రమకు షాకింగ్ న్యూస్. మంచి నటుడ్ని కోల్పోయింది. ఒక విషాదకర సంఘటన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను''.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu