అన్ స్టాపబుల్ బాలయ్య
posted on Aug 31, 2024 9:30AM
అర్ధ శతాబ్ద సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. సినీ రాజకీయ రంగాలలో అన్ స్టాపబుల్ గా సాగాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందించారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ రంగాలలో అన్ స్టాపబుల్ గా సాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఆయన ఓ ప్రకటనలో సినీ హీరోగానే కాకుండా ప్రజా నేతగా కూడా బాలకృష్ణ అందరి అభినందనలూ అందుకుంటున్నారని పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఐదు దశాబ్దాల కిందట తాతమ్మ కల సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారని పేర్కొన్న చంద్రబాబు, తండ్రి బాటలోనే రాజకీయ ప్రవేశం చేసి ప్రజా నేతగా గుర్తింపు పొందారన్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్ల విజయం సాధించి ప్రజా నేతగా కొనసాగుతున్నారని అభినందించారు.
నందమూరి బాలకృష్ణ అల్లుడు, మంత్రి నారా లోకేష్ కూడా అభినందనలు తెలిపారు. 1974లో సీనిరంగంలోకి ప్రవేశించిన మామయ్య ఐదు దశాబ్దాలలో 109 సినిమాలలో హీరోగా ఎన్నోఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారని, గాడ్ ఆఫ్ మాసెస్ గా గుర్తింపు పొందారని లోకేష్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజా నేతగా రాజకీయాలలోనూ రాణిస్తున్నారనీ, సేవా కార్యక్రమాలలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు.