భూమనపై కేసు

అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలపై వైసీపీ సీనియర్  నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై మంగళవారం (సెప్టెంబర్ 16) కేసు నమోదైంది.  తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యేటీ ఈవో గోవిందరాజులు ఫిర్యాదుపై  అలిపిరి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 

అలిపిరి సమీపంలో ఉన్న   శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని అలక్ష్యం చేస్తున్నారంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే కూడా అయిన  భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలు విమర్శలు చేశారు.   టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భూమన ఆరోపించారు.

 వాస్తవానికి తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరికి సమీపంలోని  పాత చెక్ పోస్టు వద్ద శిల్పాలు చెక్కేవారు.  23 సంవత్సరాల కిందట సీఎం నారా చంద్రబాబుపై బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఇక్కడి శిల్పాలు చెక్కే వారిని ఖాళీ చేయించారు.  ఆ సందర్భంగా అప్పట్లో స్థపతులు శనేశ్వరుడి తొమ్మిది అడుగుల విగ్రహం అక్కడే వదిలేశారు. దీంతో అప్పటి నుంచీ ఆ విగ్రహం అక్కడే ఉందని టీటీడీ వివరించింది. అయినా.. భూమన తన ఆరోపణలను కొనసాగించడంతో.. టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజులు భూమనపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu