18 ఉప ఎన్నికల్లో గెలుపు బిజెపిదేనట?
posted on Mar 31, 2012 10:07AM
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా ఒక సీటును గెల్చుకున్న బిజెపి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆనందంలో బిజెపి నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదు. మే లేదా జూన్ లో రాష్ట్రంలోని 18 శాసనసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో బిజెపి భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసి భారీ మెజారిటీతో గెలుస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. లక్ష్మణ్ అంటున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయని ఆయన జోస్యం కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలు రెండు దారుణంగా విఫలమయ్యాయని ఆయన అంటూ తెలంగాణా సాధన ఒక్క బిజెపి వల్లనే సాధ్యమవుతుందని ఆయన అంటున్నారు.