ఆసియా క‌ప్‌కు  బుమ్రా దూరం

టీమ్ ఇండియాకి బౌలింగ్ ప్ర‌ధాన అస్త్రం జ‌స్ప్రీత్ బుమ్రా. వ‌న్డేలైనా, టీ-20లైనా అత‌ను త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. అంత‌గా బౌలింగ్ విభాగం అత‌ని మీద ఆధార‌ప‌డింద‌నే అనాలి. అయితే ఎవ్వ‌రూ ఆట్టే కాలం వ‌రుస సిరీస్‌ల్లో అంతే అద్భుతంగా రాణించ‌లేరు. చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ త‌లెత్తుతాయి. ముఖ్యం పేస‌ర్ల‌కు ఇలాంటి ఇబ్బంది వ‌స్తుంది. బుమ్రా కూడా ప్ర‌స్తుతం వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతు న్నాడు. ఈ కార‌ణంగానే ఆసియా క‌ప్ పోటీల‌కు జ‌ట్టులోకి ఎంపిక కాలేదు. ఇప్పుడు వాస్త‌వానికి  ఈ టోర్నీలో కీల‌క‌పాత్ర వ‌హించాల్సింది. 

కానీ శారీర‌కంగా ఫిట్నెస్ దృష్ట్యా అత‌నికి విశ్రాంతినీయ‌డ‌మే మేల‌ని బిసిసిఐ భావించింది. అత‌న్ని జ‌ట్టులోకి తీసుకుని మ‌రింత ఇబ్బంది పెట్ట‌డం మంచిది కాద‌ని బిసిసిఐ భావి స్తోంది. విశ్రాంతి అనంత‌రం అత‌ను ఇక టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లోనే టీమ్ ఇండియాలోకి రావ‌చ్చు. బుమ్రా చివరిగా ఇంగ్లండ్‌పైవన్డే సిరీస్ ఆడాడు. 

విశ్రాంతి దృష్ట్యా వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌లో ఆడించ లేదు. బుమ్రాకు ఇలాంటి స‌మ‌స్య  గ‌తంలోనూ త‌లెత్తి కొంత‌కాలం జ‌ట్టుకు దూరంగా ఉన్న సంగ‌తి తెలి సిందే. అయితే స్వదేశంలో కీలకమైన ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాపై సిరీస్‌ల నేపథ్యంలో  ఫిట్‌గా ఉం చేందుకుగానూ  బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అందుబాటులో ఉండ‌మ‌ని  బుమ్రాను కోర‌వ చ్చు. అవకాశాలున్నాయి. కొన్నేళ్లక్రితం కూడా బుమ్రా ఇదే తరహా సమస్యతో బాధపడ్డాడు. ఎక్కువకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 

ఇదిలా ఉండ‌గా,  టీ20 వరల్డ్ కప్‌కు ముందు కీలకమైన ఆసియా టీ20 కప్‌లో ఆడబోయే భారత జట్టుకు  బీసీసీఐ సోమవారం ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులోకి పునరాగ మనం చేసిన కేఎల్ రాహుల్ వైస్‌కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక కొంత విశ్రాంతి తర్వాత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జట్టులో తిరిగి  చోటు దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ఆరంభమవనుంది.