కానిస్టేబుల్ తల నరికేశారు...

 

కర్నూలు జిల్లాకి చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. బండి ఆత్మకూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు 9వ బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మూడు రోజుల క్రితం తన కుటుంబాన్ని కర్నూలులో వదిలిపెట్టడానికి వెళ్ళాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. మూడు రోజుల తర్వాత అతని తల బండి ఆత్మకూరు సమీపంలో దొరికింది. అది వెంకటేశ్వర్లు తలగా స్థానికులు, బంధువులు గుర్తించారు. మొండెం కోసం అన్వేషణ జరపగా కోడూరు పరిసరాల్లో అతని మొండెం దొరికింది. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు హత్యకు ఆస్తి తగాదాలు గానీ, వివాహేతర సంబంధం గానీ కారణమై వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.