దీన్ని కరోనా వ్యాక్సిన్ అంటారా.. అమ్మకాలు ఆపేయండి ! బాబా రామ్ దేవ్‌ కు బ్రిటన్ షాక్ 

ప్రముఖ యోగా గురువు , పతంజలి బాబా రామ్ దేవ్ కు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది.  పతంజంలి ఆయుర్వేద సంస్థ కరోనిల్ కిట్ అమ్మకాలను నిషేదించింది. కరోనిల్ కిట్లను మ్మితే చర్యలు తీసుంటామని  బ్రిటన్ వైద్య ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) హెచ్చరికలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా కరోనిల్ కిట్ ఎలా అమ్ముతారంటూ ఘాటుగా ప్రశ్నించింది. బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజంలి ఆయుర్వేద సంస్థ కరోనిల్ కిట్ రూపొందించింది.   జూన్ 23న ఇండియాలో బాబా రామ్ దేవ్ ఈ కిట్లను విడుదల చేశారు. తాజాగా ఈ కిట్లను బ్రిటన్ లో అమ్మకాలు ప్రారంభించింది  పతంజలి సంస్థ. కరోనిల్ కిట్ పేరుతో ఇదే కరోనా వ్యాక్సిన్ అంటూ బ్రిటన్ లో ఆ సంస్థ అమ్మకాలు చేస్తోంది. పతంజలి అమ్మకాలపై ఎంహెచ్ఆర్ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 కరోనిల్ కిట్లపై యూకే బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. కరోనిల్ కిట్ కరోనాని నయం చేస్తుందా అన్న అంశంపై సైంటిస్ట్ లు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో యూకేలో అమ్ముతున్న పతంజలి సంస్థకు చెందిన కరోనిల్ రోగనిరోధక శక్తిని పెంచడంలేదని, వృక్ష సంబంధిత పదార్థాలతో చేసిన ఈ కరోనా నిల్ కిట్ వల్ల ఎలాంటి ఫలితాలు లేవని బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ సైంటిస్ట్ వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ చెప్పారు. దీంతో కరోనిల్ కిట్ల అమ్మకాలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బ్రిటన్ వైద్య ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu