స్కూల్లో కాల్పులు... ఒకరి మృతి
posted on Mar 13, 2015 11:02AM

బ్రెజిల్ లోని బెలో హరిజోటి మెట్రో పాలిటిన్ ప్రాంతంలో ఉన్న స్కూల్లో ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంతో స్కూల్ విద్యార్థులు, సిబ్బంది కారిడార్ నుంచి తరగతి గదుల్లోకి భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన వెంటనే ఆగంతకుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్కూలు సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, ఒకరి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గాయపడిన వారిలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు. స్కూల్ లోకి ప్రవేశిస్తున్న ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఆగంతకుడు కాల్పులు జరిపాడని, ఈ కాల్పుల ఘటనకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.