'రస్ ఆల్ ఖైమా'కు రూ. 800 కోట్లతో వైసీపీ ఎంపీలు.. త్వరలో జగన్ జైలుకి!!
posted on Feb 22, 2020 1:24PM

రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే జగన్ సర్కార్ అమరావతి భూముల వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా జైల్లో ఎందుకున్నారో జగన్ చెప్పాలని బోండా ఉమా నిలదీశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో ఏం మాట్లాడారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రస్ ఆల్ ఖైమా కేసు విషయంలో వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు జగన్.. వైసీపీ ఎంపీలను ఆ దేశం పంపారని ఆరోపించారు. నేరస్థుల ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి జగన్‌ను అప్పగించే పరిస్థితి ఉందని అన్నారు. ఈ కేసుల నుంచి బయటపడేయాలని జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని వేడుకున్నారని బోండా ఉమా ఆరోపించారు.