రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్

 

రేపటి నుంచి తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గోల్కొండ జగదాంబకి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. 

అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించేలా తల్లి దీవెనలు ఉండాలన్నారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సదుపాయం కోసం రూ.20 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu