కేసీఆర్‌తో క‌లిసిన వేళావిశేషం.. నీతిష్‌కు బీజేపీ స‌వాల్‌!

కొంద‌రితో క‌లిస్తే దుర‌దృష్టం వెన్నాడుతుందంటారు. అందులో నిజం ఉందా లేదా అన్న‌ది  అవ‌త‌ల పెడితే, ప్ర‌స్తుతం తెలంగాణా సీఎం కేసీఆర్‌తో క‌లిసిన ప్ర‌తీవారికి ఏదో ఒక స‌మ‌స్య త‌లెత్తుతోంది. తాజాగా బీహార్ సీఎం నీతిష్ కుమార్ ప‌రిస్థితి అదే. మొన్న‌నే తాజాగా నీతిష్‌తో కేసీఆర్ క‌లిశారు. అప్పుడే బీజేపీ హెచ్చ‌రిక‌లు జారీచేసింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌లే బీహార్ ప‌ర్య‌టించారు. అది కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సం దేహం అవసరం లేదు. తన  ప్రసంగంలో బీజేపీ ముక్త భారత్ అంశాన్ని ప్రస్తావించారు. అందుకోసం నితీష్ కుమార్తో కలిసి పని చేస్తామన్నారు. కమలం పార్టీ పాలనలో దేశం అన్ని విధాలుగా నష్టపోయిం దన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తు ల ఐక్యత నేడు దేశానికి అత్యవసరమన్నారు. నితీష్ తో కలిసి ఆ దిశగా  పని చేస్తామన్నారు.  

రాబో యేది  థర్డ్ ఫ్రంట్  కాదనీ, అది మెయిన్ ఫ్రంట్ అనీ చెప్పారు. ఈ ఫ్రంట్ కు నాయక త్వం ఎవరు వహిస్తారన్న ది ఎన్నికల సమయంలో అందరం చర్చించుకుని నిర్ణయిస్తామని  కేసీఆర్ చెప్పారు.  కేసీ ఆర్ తో  ఎవ‌రు క‌లిసినా భ‌విష్య‌త్తులో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌న్న‌ది  బీహార్ ముఖ్య‌మంత్రి నీతిష్ కూడా గ్ర‌హిం చక‌పోలేదు. క‌నుక‌నే ఆ స‌భ‌లో నీతిష్ కాస్తంత ఇబ్బందిప‌డి మ‌ధ్య‌లోనే లేచి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా, కేసీఆర్ కోరిక‌మీద కూర్చుండిపోయారు. 

కానీ, చిత్రంగా బీజేపీ నుంచి అప్పుడే స‌వాలు ఎదుర‌యింది బీహార్ సీఎంకి. గ‌తంలో నీతిష్ కు డిప్యూటీగా చేసిన బీజేపీ ఎంపి సుశీల్ కుమార్ 2024 ఎన్నిక‌ల్లో మీరు ఎవ‌రి మ‌ద్ద‌తు తీసుకున్నా,  ప్ర‌ధాని స్థానం స‌రే,   మీ రాష్ట్ర సీఎంగానూ ఉండ‌గ‌ల‌రా అని స‌వాలు విసిరారు. బీజేపీ కేవ‌లం ప్ర‌చార ఆర్భాట‌మే కానీ వాస్త‌వానికి దేశానికి ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమ‌ని నీతిష్ చేసిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా సుశీల్ ఈ స‌వాలు విసిరారు. 

నీతిష్గారూ మీరు స‌ర‌యిన స్నేహ‌సంబంధాలు నిర్వ‌హించ‌డం లేదు, బీహార్‌కు మోదీ ఎంతో చేశార‌న్న ది మీరు గ్ర‌హించాల‌ని సుశీల్ అన్నారు. కేసీఆర్‌, నీతిష్ కి ఎన్నిక‌లు గెలిచే ధైర్యం ఉంటే, బీజేపీని ధీటు గా ఎదుర్కోగ‌ల‌మ‌న్న స‌త్తా ఉంటే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ నుంచి పోటీ చేయ‌మ‌ని సుశీల్ కుమా ర్ స‌వాలు విసిరారు. మోదీ ప్ర‌భుత్వం కేవ‌లం ప్ర‌చారం మీద‌నే ఆధార‌ప‌డి ఇంత‌కాలం ఉన్న‌ద‌ని అనుకుంటే, మ‌రి 18 రాష్ట్రాల్లో అధికారంలోకి ఎలా వ‌స్తుంద‌న్న‌ది మీరే ఆలోచించుకోండ‌ని సుశీల్ అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu