ఒక్కో కేసు కాదు సీఎం.. ఒకేసారి లక్ష కేసులు పెట్టుకో..

మగధీరలో భైరవ రేంజ్ లో డైలాగ్ వదిలారు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్. తనపై ఒక్కో కేసు నమోదు చేసే బదులు.. అన్ని కేసులు ఒకేసారి బుక్ చేయాలని సీఎంను, హోంమంత్రిని కోరారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రాజాసింగ్ పై మరో కేసు నమోదు చేయడంతో ఆయన విసుగు చెందారు. తనపై లక్షల కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ధర్మం, దేశం గురించి పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోందని రాజసింగ్ ఆరోపించారు. 

గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడం.. నగరంలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం.. ఇలా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో తాను అనుకున్నది చేస్తూ పోవడమే ఆయన స్టైల్. అందుకు, రూల్స్, రెగ్యులేషన్స్, పర్మిషన్స్ లాంటివి ఏవీ పట్టించుకోరు. సమస్య ఉన్న చోట వాలిపోతుంటారు. ఈ క్రమంలో అనేకసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. ఆ వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉంటారు. ఇలా రాజాసింగ్ పై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. లేటెస్ట్ గా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ లో మరో కేసు నమోదవడంతో రాజాసింగ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఒక్కో కేసు నమోదు చేసే బదులు.. అన్ని కేసులు ఒకేసారి బుక్ చేయాలని ముఖ్యమంత్రికి, హోంమంత్రికి సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu