కేసీఆర్ కు చేతకాదంటే 100 కోట్లిస్తాం..

కేసీఆర్‌ ఓ సన్నాసి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీదే అధికారం. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ ఇంకా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌కు చేతకాదని ఒప్పుకుంటే నెల రోజుల్లో ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేంద్రం నుంచి తెస్తామన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. 

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా వారిని అవమానిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివాసీల భూములకు పట్టాలిస్తామంటేనే వారు టీఆర్‌ఎస్ లో చేరారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమన్నారు రఘునందన్ రావు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu