ఆ రైతు నేతలను ఉరి తీయాలి.. బీజేపీ నేత సంచలన లేఖ 

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాకాండకు పాల్పడిన రైతు నాయకులను ఉరి తీయాలని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ కూడా రాశారు. హింసాకాండకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిని పోలీసులతో కాల్చి చంపాలని గుర్జర్ ఆ లేఖలో కోరారు. హింసాకాండలో పాల్గొన్న రైతు నాయకులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఉరి తీయాలని నంద్ కిషోర్ అమిత్ షాను కోరారు. ఇది ఇలా ఉండగా ట్రాక్టరు ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండలో కొంత మంది రైతు నాయకులు కూడా పాల్గొన్నారని ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీవాస్తవ చెప్పారు. రైతు నాయకులు ర్యాలీ సందర్భంగా తాము విధించిన షరతులను పాటించలేదని, మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల మధ్య నిరసనకు అనుమతినివ్వగా దానిని వారు ఉల్లంఘించారని, దీంతో 19 మంది నేతలను అరెస్టు చేశామని, మరో 50మందిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసు చీఫ్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu