బాబు పోతే ఏంటి.. మాకు మరో దోస్తీ దొరికింది

కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదంటూ, నాలుగేళ్ళ దోస్తీకి స్వస్తి పలికి టీడీపీ, ఎన్డీయే నుండి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.. బీజేపీ కి మిత్రపక్షాలు దూరమవ్వడం, ప్రజల్లో వ్యతిరేకత మొదలవ్వడంతో మోడీ అండ్ అమిత్ షా ద్వయం వచ్చే ఎన్నికల గురించి కాస్తైనా భయపడతారని అంతా అనుకున్నారు.. కానీ ఆ భయం వారిలో కనిపించట్లేదు.. తాజాగా అమిత్ షా బీహార్ పర్యటనకు వెళ్లారు.. ఈ సందర్బంగా ఆయన టీడీపీ గురించి, అలానే వచ్చే ఎన్నికల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

 

 

కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు.. 2014లోనే వారందరినీ తాము ఓడించామని గుర్తు చేశారు.. 2014 కంటే 2019లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని తెలిపారు.. ఎన్డీయే మరింత బలపడుతోందని అన్నారు.. చంద్రబాబు ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు, దాని వల్ల పడిన ప్రభావం ఏంటి?.. నితీష్ వచ్చి మాతో కలిశారు.. బీహార్‌లో అవినీతిపరులతో చేతులు కలపడం ఇష్టం లేకే నితీష్ కుమార్ తమతో ఉంటున్నారని, ఇది మంచి పరిణామం అని అమిత్ షా అన్నారు.